ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీకి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు
ABN , First Publish Date - 2022-08-07T05:08:47+05:30 IST
జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన వైద్యకళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం పరిపాలనపరమైన అనుమతులను మంజూరు చేస్తూ జీవోజారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 98 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఎఎం రెజ్వీ ఉత్తర్వులను జారీ చేశారు.
- రూ.169 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
- జీవో నం. ఎంఎస్98తో ఉత్తర్వులు జారీ
ఆసిఫాబాద్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన వైద్యకళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం పరిపాలనపరమైన అనుమతులను మంజూరు చేస్తూ జీవోజారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 98 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఎఎం రెజ్వీ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్తగా నిర్మించే వైద్యకళాశాలకు సంబంధించి 100మెడికల్ సీట్లతో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను భవనాలు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం రూ.169 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను ఆర్థిక శాఖకు పంపించారు. అలాగే ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుబంధంగా అనుసంధానించనున్నారు. ఇదిలా ఉండగా ఆరునెలల క్రితమే ఆసిఫాబాద్ సమీపంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రి హరీష్రావు భవన సముదాయాల శంకుస్థాపన చేశారు. తాజా ఉత్తర్వులతో కళాశాల ఏర్పాటుకు మార్గం క్లియరెన్స్ అయింది.
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు..
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు శనివారం హైదరాబాద్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోనేరు కోనప్ప కలిశారు. ఈ సం దర్భంగా జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.