ఆసిఫాబాద్‌కు మెడికల్‌ కళాశాల మంజూరుపై హర్షం

ABN , First Publish Date - 2022-03-08T03:43:28+05:30 IST

ఆసిఫాబాద్‌కు మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడంపై టీఆర్‌ ఎస్‌ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రంసక్కు హర్షం వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్‌కు మెడికల్‌ కళాశాల మంజూరుపై హర్షం
ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యేలు

-సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఙతలు తెలిపిన ఎమ్మెల్యేలు 

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి 7: ఆసిఫాబాద్‌కు మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడంపై టీఆర్‌ ఎస్‌ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రంసక్కు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎంచాంబర్‌లోకి వెళ్లి కేసీఆర్‌కు పుష్పం గుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - 2022-03-08T03:43:28+05:30 IST