జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
ABN , First Publish Date - 2022-11-14T01:08:19+05:30 IST
జాతీయ లోక్‌ఆదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, నవంబరు 13: జాతీయ లోక్‌ఆదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుంచి ఆయన మా ట్లాడుతూ లోక్ ఆదాలత్ కార్యక్రమంలో 1,252 కేసులను పరిష్కరించగా రూ.13 లక్షల పైచిలుకు వాహన జరిమానాలు వసూలు చేయడం జరిగింద ని తెలిపారు. కాగా 249 ఎఫ్‌ఐఆర్, 731 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కా రమయ్యాయని అన్నారు. కాగా 249 ఐపీసీ కేసులకు గాను రూ.5లక్షల 91 వేల 100 జరిమానా, ఈ పెట్టి కేసులు 23లకు గాను రూ.7వేల 200లు, డ్రంక్ డ్రైవ్ కేసులు 731 గాను రూ.7లక్షల 46వేల 100 వచ్చినట్లు తెలిపా రు. అయితే ఎఫ్‌ఐఆర్ కేసుల్లో, ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్సైజ్ కేసుల్లో నేరారోపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో రూ.13లక్షల 48వేల 400 జరిమానా రూపంలో ఆదాయం సమకూరిందన్నారు. పోలీసు స్టేషన్‌లో నమోదైన కొట్లాట, భార్య భర్తల మధ్య వివాహానికి సంబంధించి వివాదాలు, అత్తింటి వారి వేధింపులు అన్నిరకాల క్రిమినల్ కేసుల్లో నిందితులు, బాధితులు కలిసి హాజరై రాజీ మార్గంలో రాజీపడడంతో కేసులను కొట్టి వేసినట్లు తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి కృషి చేసినందుకు గాను జిల్లా న్యాయమూర్తి సునీత, జిల్లా న్యాయసేవా అధికార సంస్థకు జిల్లా పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.