Nirmal Dist.: నేడు మావోయిస్టు నేత అనిత అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-12-25T11:00:08+05:30 IST

నిర్మల్ జిల్లా: కడెం మండలం, లక్ష్మిసాగర్‌లో మావోయిస్టు నేత కంతి లింగవ్వ (Kanti Lingavva) అలియాస్ అనిత (Anitha) అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.

Nirmal Dist.: నేడు మావోయిస్టు నేత అనిత అంత్యక్రియలు

నిర్మల్ జిల్లా: కడెం మండలం, లక్ష్మిసాగర్‌లో మావోయిస్టు నేత (Maoist leader) కంతి లింగవ్వ (Kanti Lingavva) అలియాస్ అనిత (Anitha) అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఇందు కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మొన్న (శుక్రవారం) మహరాష్ట్ర (Maharashtra) - చత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌ (Encounter)లో ఆమె మృతి చెందింది. లింగవ్వ కొమురం భీం-మంచిర్యాల జిల్లాల డివిజన్ కమిటీ సభ్యురాలిగా ‌పనిచేస్తోంది. ఆమె మృత దేహం ఆదివారం మధ్యాహ్నానికి స్వగ్రామం చేరుకోనుంది. లింగవ్వ అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. లక్ష్మీ సాగర్ గ్రామంపై నిఘా పెట్టారు. కాగా మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు లింగవ్వ మరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Updated Date - 2022-12-25T11:00:12+05:30 IST