పూడిక ముప్పు!

ABN , First Publish Date - 2022-04-21T05:41:34+05:30 IST

జిల్లాలో ప్రధా న ప్రాజెక్టులుగా చెప్పుకునే సాత్నాల, మత్తడివాగు ప్రా జెక్టులకు పూడిక ముప్పు కనిపిస్తోంది. ప్రాజెక్టుల పరి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో యేటా సాగు విస్తీర్ణం గణనీయంగా త గ్గిపోతోంది. 1996లో నిర్మాణం పూర్తి చేసుకున్న సాత్నాల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌

పూడిక ముప్పు!
నీటి నిలువలు అడుగంటుకపోయి వెలవెలబోతున్న మత్తడివాగు ప్రాజెక్టు

ప్రాజెక్టుల్లో యేటేటా తగ్గిపోతున్న నీటి నిల్వలు
పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారిన కాల్వలు
బీటలు భారి.. కుంగిపోతున్న ఆనకట్టల పైభాగం
ఎగువ ప్రాంతంలో నేలమట్టమైన షీల్ట్‌ అరెస్టు ట్యాంకులు
పూడిక నిల్వల అంచనాలకు ఇదే అనువైన సమయం
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న సంబంధిత అధికారులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధా న ప్రాజెక్టులుగా చెప్పుకునే సాత్నాల, మత్తడివాగు ప్రా జెక్టులకు పూడిక ముప్పు కనిపిస్తోంది. ప్రాజెక్టుల పరి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో యేటా సాగు విస్తీర్ణం గణనీయంగా త గ్గిపోతోంది. 1996లో నిర్మాణం పూర్తి చేసుకున్న సాత్నాల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల మండలాల్లో కుడి కాల్వ ద్వారా 20650 ఎకరా లు, ఎడమ కాల్వ ద్వారా 3,350 ఎకరాలు.. మొత్తం 24వేల ఎకరాల ఆ యకట్టుకు సాగునీరు అందేది. కాని రెండున్నర దశాబ్దాలు గడిచిపోవడం తో సగానికిపైగా ఆయకట్టు విస్తీర్ణం పడి పోవడం అన్నదాతలను ఆందో ళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల ద్వారా 8వేల ఎకరా ల ఆయకట్టును కూడా దాటడం లేదు. ఈ పరిస్థితికి ప్రాజెక్టులో పెరిగి పోతున్న పూడికనే ప్రధాన కారణమంటున్నారు. అలాగే మత్తడి వాగు ప్రాజెక్టుకు కూడా పూడిక ముప్పు పెరిగిపోతోంది. మార్చి, ఏప్రిల్‌లలోనే నీటి నిల్వలు అడుగంటుక పోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాజెక్టు కింద 8,500 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కనీసం నాలుగు వేల ఎకరాలు కూడా దాటడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు ప్రాజెక్టులో పూడిక నిల్వల పై దృష్టి సారించక పోవడంతో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి.
వేగంగా పేరుకుపోతున్న పూడిక
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగానే ఎగువభాగంలో షీల్ట్‌ అరెస్టు ట్యాంకుల ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టు ఎగువ భాగంలో ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వేగంగా వరద నీటితో పూడికమట్టి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జిల్లా లో అధికంగా నల్లరేగడి నేలలే ఉండడంతో చిన్నపాటి వర్షాలకే నేల కోత కు గురవుతుంది. కనీసం ప్రాజెక్టు నీటి ఆధార కాల్వలపైన అక్కడక్క డా చెక్‌డ్యాంలు నిర్మించి ఉంటే కొంత వరకైనా పూడికమట్టికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉండేది. అలాగే ప్రాజెక్టు ఎగువ భాగానా ఎత్తైన కొండలు, గుట్టలు ఉండడంతో చిన్న పాటి వర్షాలకే పూడిక మట్టి వేగంగా ప్రాజెక్టు లోకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 32 మీటర్ల మేరకు పూడికమట్టి చేరి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నా రు. కాని అధికారికంగా పూడికమట్టి నిల్వలపై సర్వే నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆధునిక పద్ధతుల ద్వారా పూడికమట్టిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రాజెక్టుల నీటి మట్టం ప్రశ్నార్థకంగా మారింది.  
డెడ్‌ లెవల్‌కు నీటిమట్టం
జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా.. వేసవి ప్రారంభంలోనే ప్రాజెక్టులు డెడ్‌ లెవల్‌కు చేరుకుంటున్నాయి. ఎందు కంటే భారీగా పూడికమట్టి చేరడంతో నీటి నిల్వలు తొందరగా అడుగంటుకపోతున్నాయి. పూర్తిస్థాయిలో నీటి నిల్వలను వినియోగించుకునేందు కు ప్రాజెక్టును నిర్మించినా.. దాని పరిరక్షణపై పట్టింపు కరువవుతోంది. సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 286.50 మీటర్లు కాగా, నీటినిల్వలు భారీగా పడిపోయి డెడ్‌ లెవల్‌కు చేరుకుంది. అలాగే మత్తడి వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 279.5 మీటర్లకు గాను, ప్రస్తుతం అంతంత మాత్రంగానే నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. పెరిగిపోతున్న పూడికతో యేటా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. చిన్నపాటి వర్షాలకే ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. అతివేగంగా నిండుకోవడా నికి పూడిక నిల్వలు పేరుకపోవడమే ప్రధాన కారణమంటున్నారు. ఇలాం టి పరిస్థితుల్లో నీటి అంచనాలు వేయడం కూడా కష్ట సాధ్యంగానే మా రింది. అధికారుల అంచనాలు తారుమారు కావడంతో ప్రతి యేటా వేల క్యూసెక్కుల వరదనీరు వృఽథాగా దిగువకు వెళ్లి పోతోంది. సరిపడా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చినా.. నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.
ముందుచూపు కరువు
ప్రాజెక్టుల వద్ద తలెత్తే సమస్యలను వేసవిలోనే పరిష్కరించుకొని వానాకాలం సాగుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కాని అధికారులకు ముందుచూపు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రాజెక్టుల ఆనకట్టలు ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ నెర్రె లు, భారీ బుంగలు పడ్డాయి. కాలువల పరిస్థితి అయితే మరీ అధ్వానం. అక్కడక్కడా సిమెంట్‌ పనులు ధ్వంసమైపోయి కనిపిస్తున్నాయి. అలాగే సాత్నాల ప్రాజెక్టు ఆనకట్ట పైభాగంలో బీటలు వారి కుంగిపోతునట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టుల కుడి, ఎడమ కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగి పోయి అధ్వానంగా తయారయ్యాయి. వర్షా కాలానికి సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఇకనైనా ప్రాజెక్టులపై ప్రత్యేకదృష్టి సారిస్తేనే వర్షా కాలంలో ఆయకట్టులకు ఇబ్బందులు తప్పడంతో పాటు ఆయకట్టు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రతియేటా అనువైన సమయంలో పనులు చేపట్టక పోవడంతో ఆయకట్టు సాగు అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
: శ్రీనివాస్‌, డీఈ, ఆదిలాబాద్‌
జిల్లాలో ప్రధానమైన సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల పూడికపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. యేటా పూడిక పెరుగుతూ వస్తోంది. వేసవిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలను చేపడుతున్నాం. చిన్నచిన్న మరమ్మతులు, షీల్ట్‌ తొలగింపు, ప్రధానగేట్ల మరమ్మతులు చేపట్టి వానా కాలానికి అన్నిరకాలుగా సిద్ధం చేస్తున్నాం.

Updated Date - 2022-04-21T05:41:34+05:30 IST