పకడ్బందీగా పోడు భూముల సర్వే

ABN , First Publish Date - 2022-10-13T04:40:21+05:30 IST

పోడుభూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నార్నూర్‌ మండలంలోని బలాన్‌ పూర్‌లో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ పట్టా భూములను వేరు వేరుగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా పోడు భూముల సర్వే
బలాన్‌పూర్‌లో పోడు భూముల సర్వేను పరిశీలిస్తున్న పీవో

సర్వే పనులను పరిశీలించిన పీవో వరున్‌రెడ్డి

ఉట్నూర్‌, అక్టోబరు 12: పోడుభూముల సర్వేను  పకడ్బందీగా చేపట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నార్నూర్‌ మండలంలోని బలాన్‌ పూర్‌లో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ పట్టా భూములను వేరు వేరుగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయిన తరువాత ఒక్క అంగులం భూమి కూడా అక్రమనకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. దర ఖాస్తు దారుల భూ సంబందిత అర్హత పత్రాలు 2005 సంవత్సరం నుంచి పరిశీ లించాలన్నారు. ప్రతీరోజు  పది మంది దరఖాస్తుల చొప్పున సర్వే చేపట్టాలన్నా రు. సర్వే నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా తహసీల్దార్‌, పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో నిర్వహించాలన్నారు. భూము ల సర్వే వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు.  నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని, సమస్యలు వస్తే జిల్లా అధికారులకు తెలి యజేసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దుర్వ లక్ష్మణ్‌, సర్పంచ్‌ ఆత్రం పరమేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

భీంపూర్‌, నార్నూర్‌ పాఠశాలల తనిఖీ 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌, నార్నూర్‌ పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలతో పాటు భీంపూర్‌లోని బాలుర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్య, భోజన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం ప్రతీరోజు పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థు లకు అర్ఠమయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు. దోమలతో వచ్చే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఆశ్రమ పాఠశాలల ఆవరణలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వంట గదులు, స్టోర్‌ రూమ్‌ లు, మరుగుదొడ్లు, తాగునీటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఇందులో హెచ్‌ఎం జాదవ్‌ విఠల్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - 2022-10-13T04:40:21+05:30 IST