Bairi Naresh: పరిగి సబ్‌జైలుకు బైరి నరేష్‌ తరలింపు

ABN , First Publish Date - 2022-12-31T17:28:00+05:30 IST

పరిగి సబ్‌జైలుకు బైరి నరేష్‌ (Bairi Naresh) తరలించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను అరెస్టు చేశారు. నరేష్‌ను కొడంగల్‌ కోర్టు (Kodangal Court)లో హాజరపర్చారు.

Bairi Naresh: పరిగి సబ్‌జైలుకు బైరి నరేష్‌ తరలింపు

వికారాబాద్‌: పరిగి సబ్‌జైలుకు బైరి నరేష్‌ (Bairi Naresh) తరలించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను అరెస్టు చేశారు. నరేష్‌ను కొడంగల్‌ కోర్టు (Kodangal Court)లో హాజరపర్చారు. నిందితుడికి కొడంగల్‌ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని భారీ బందోబస్తు మధ్య పరిగి సబ్‌జైలుకు తరలించారు. నరేష్‌ అరెస్ట్‌తో అయ్యప్పభక్తులు శాంతించలేదు. పరిగి సబ్‌జైలు ఆవరణలోకి దూసుకువచ్చారు. నరేష్‌పై దాడికి యత్నించారు. నరేష్‌ పరిగెత్తుకుంటూ సబ్‌జైలులోకి వెళ్లాడు. ఆందోళనకారులకు జైలు అధికారులు సర్దిచెప్పారు. వరంగల్‌ (Warangal) పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్‌ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-12-31T17:28:01+05:30 IST