Bandi Sanjay: బెంగళూరు డ్రగ్స్‌ కేసును రీఓపెన్ చేస్తాం.. టీఆర్‌ఎస్‌ నేతల డ్రగ్స్ దందా.. ఎవ్వరినీ వదలం

ABN , First Publish Date - 2022-12-01T18:56:10+05:30 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: బెంగళూరు డ్రగ్స్‌ కేసును రీఓపెన్ చేస్తాం.. టీఆర్‌ఎస్‌ నేతల డ్రగ్స్ దందా.. ఎవ్వరినీ వదలం

నిర్మల్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు డ్రగ్స్‌ (DRUGS) కేసును రీఓపెన్ చేయబోతున్నామని బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ (TRS) నేతలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని సంజయ్‌ చెప్పారు. కర్ణాటకలో ఉన్నది తమ బీజేపీ ప్రభుత్వమే అయినా పోలీసులకు డబ్బులు ఇచ్చి కేసు క్లోజ్‌ చేయించారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కర్ణాటక పోలీసులు, మీడియేటర్లపై చర్యలు తీసుకోవాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. త్వరలోనే కేసు విచారణ ప్రారంభమవుతుందని, తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-12-01T19:21:11+05:30 IST