Home » Bandi Sanjay
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
ఇంతకాలం సైలెంట్గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన..
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవి విజయోత్సవాలు కావని, వికృత ఉత్సవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. తాము ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.