Sad Incident: ఎంత పనిచేశావమ్మా.. అది జరగని పని అని అమ్మానాన్న చెప్పడంతో..
ABN , First Publish Date - 2022-10-28T22:03:03+05:30 IST
ఉన్నత చదువుల కోసం డబ్బులు లేవన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన..
పై చదువులకు డబ్బులు లేవన్నందుకు మనస్తాపంతో యువతి ఆత్మహత్య
వెంకటాపూర్(రామప్ప): ఉన్నత చదువుల కోసం డబ్బులు లేవన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఫొటో గ్రాఫర్ బీరెల్లి రమేష్, ఆశా కార్యకర్త కవిత దంపతుల కూతురు సాత్విక (18) ఇంటర్ పూర్తి చేసింది. బీఎస్సీ (అగ్రికల్చర్) చదవడానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటు వచ్చింది. ఈ కోర్సు చేయడానికి సుమారు 12 లక్షల ఖర్చు అవుతుండగా అంత డబ్బు తమ వద్ద లేదని తల్లిదండ్రులు చెప్పడంతో సాత్విక మనస్తాపం చెంది బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. ఎస్సై తాజుద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.