TS News: నాకు ఈడీ నోటీసులు రాలేదు: అంజన్ కుమార్ యాదవ్
ABN , First Publish Date - 2022-09-23T21:12:20+05:30 IST
తనకు ఈడి నోటీసులు రాలేదని... వస్తే సమాధానం చెబుతానని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): తనకు ఈడి నోటీసులు (ED Notice) రాలేదని... వస్తే సమాధానం చెబుతానని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పత్రిక (Congress Paper) కష్టాల్లో ఉంటే తాను సహాయం చేసింది వాస్తవమేనన్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేశానని, హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన తనకు ఐదు గజాల స్థలం కూడా లేదన్నారు. తాను ఈడికి భయపడనని, నిన్న, ఇవ్వాల రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని, దమ్ముంటే వాళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు.