Asaduddin Owaisi: ఒవైసీ కుమార్తె పెళ్లి..

ABN , First Publish Date - 2022-12-23T12:50:50+05:30 IST

మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మూడో కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌

Asaduddin Owaisi: ఒవైసీ కుమార్తె పెళ్లి..

పాతబస్తీకి సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖులు

హైదరాబాద్‌: మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మూడో కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. గురువారం హైదరాబాద్‌ పాతబస్తీలోని శాస్త్రీపురం లో ఒవైసీ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కేసీఆర్‌తోపాటు హోంమంత్రి మహమూద్‌అలీ, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, ఎంపీ సంతో్‌షరెడ్డి, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. గురువారం అర్ధరాత్రి వరకు పెళ్లి సందడి కొనసాగింది. ప్రముఖుల రాకతో పాతబస్తీ బిజీగా మారింది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌శాఖ, పారిశుధ్య, వాటర్‌వర్క్స్‌ అధికారుల హడావిడి కనిపించింది. ఇదిలా ఉండగా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ అధికారుల ఆంక్షలతో తమకు నష్టం వాటిల్లిందని పలువురు వ్యాపారులు వాపోయారు.

Updated Date - 2022-12-23T12:50:52+05:30 IST