కపిలవాయి లింగమూర్తి-మీనాక్షమ్మల సాహిత్య పురస్కారాల ప్రదానం
ABN , First Publish Date - 2022-12-25T00:43:00+05:30 IST
డా.కపిలవాయి లింగమూర్తి సాహి త్య కళాపీఠం నాగర్‌కర్నూల్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డా.కపిలవాయి లింగమూర్తి-మీనాక్షమ్మల సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు.
రవీంద్రభారతి, డిసెంబర్ 24(ఆంధ్రజ్యోతి): డా.కపిలవాయి లింగమూర్తి సాహి త్య కళాపీఠం నాగర్‌కర్నూల్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డా.కపిలవాయి లింగమూర్తి-మీనాక్షమ్మల సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ప్రముఖ కవి యెన్నం రుక్మాంగద రెడ్డి, డా.టి.వి.భాస్కరాచార్యలకు కవిపిలవాయి పురస్కారాలు, ప్రముఖ కవి మహ్మద్ జహంగీర్, రచయిత్రి కడుకుంట్ల వీణారెడ్డికు కపిలవాయి కిషోర్‌బాబు-భార్గవిదేవిల సాహిత్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజా గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పురస్కారగ్రహీతలను సత్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ సాహిత్య లోకంలో కపిలవాయి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన పేరిట పురస్కారాలు ప్రదానం చేయడమంటే వాళ్లను స్మరించుకోవడమేనని అన్నారు. కపిలవాయి లింగమూర్తి ఆశయాలను ముందు తీసుకెళ్తామన్నారు.కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, కపిలవాయి అశోక్‌బాబు, బాలాచారి పురస్కారగ్రహీతలను సన్మానించారు. ఈసందర్భంగా డా.కపిలవాయి లింగమూర్తి గ్రంథం ఉమ్మడి పాలమూరు జిల్లా కవిపండిత వంశాలు- యోగాలు గ్రంథాన్ని ఆవిష్కరించారు.