Delhi Liquor Scam.. నేడు కవితను విచారించనున్న సీబీఐ..
ABN , First Publish Date - 2022-12-11T09:10:36+05:30 IST
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో సీబీఐ (CBI) బృందం ఆదివారం ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను విచారణ చేయునున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో సీబీఐ (CBI) బృందం ఆదివారం ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను విచారణ చేయునున్నారు. బంజారాహిల్స్‌లోని
ఆమె నివాసంలోనే ఉదయం 11 గంటలకు విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారించనున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులతో పాటు తండ్రి సీఎం కేసీఆర్‌తో కవిత నోటీసులపై చర్చించిన విషయం తెలిసిందే.