సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ABN , First Publish Date - 2022-10-30T13:39:15+05:30 IST

హైదరాబాద్: నటీ సమంత (Samantha) అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు.

సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

హైదరాబాద్: నటీ సమంత (Samantha) అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని, మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమంత ఒక అద్భుతమైన అమ్మాయని, అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుందన్నారు. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నానని, సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సమంత ట్వీట్..

‘‘గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్‌’(Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ (samantha autoimmune condition) సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరొక్క రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-10-30T13:43:18+05:30 IST