custard apple: నోరూరిస్తున్న సీతాఫలాలు..కేజీ ధర ఎంతంటే..?

ABN , First Publish Date - 2022-11-14T10:30:14+05:30 IST

సహజసిద్ధంగా లభించేవి సీతాఫలాలు(custard apple). ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా

custard apple: నోరూరిస్తున్న సీతాఫలాలు..కేజీ ధర ఎంతంటే..?

హైదరాబాద్/చిలకలగూడ: సహజసిద్ధంగా లభించేవి సీతాఫలాలు(custard apple). ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభ్యమవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఏవోసీ, సఫిల్‌గూడ రైల్వేస్టేషన్‌, తార్నాక ఫ్లై ఓవర్‌ వద్ద వ్యాన్లు, తోపుడు బండ్లపై అమ్మకాలు సాగిస్తున్నారు. సీతాఫలాలను చూస్తుంటే అటుగా వెళ్లేవారికి నోరూరుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్‌, అకోలా నుంచి దిగుమతి అవుతున్న సీతాఫలాలు మన దగ్గర లభించే వాటి కంటే పెద్దగా ఉంటాయని సంధ్య అనే వ్యాపారి తెలిపారు. కేజీ ధర రూ.200 వరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఆకర్శణీయంగా, పెద్ద సైజులో ఉండడంతో అటుగా వెళ్లేవారు కోనుగోలు చేస్తున్నారు. వీటిలో అధిక పోషక విలువ లు ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-14T10:30:16+05:30 IST