జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి
ABN , First Publish Date - 2022-11-11T00:24:16+05:30 IST
నీటివనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవటంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని, భవిష్యత్‌లో తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు వీ ప్రకాష్ పేర్కొన్నారు.
చార్మినార్ నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): నీటివనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవటంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని, భవిష్యత్‌లో తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు వీ ప్రకాష్ పేర్కొన్నారు. గురువారం సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ - అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ’ అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించారు. మొదటి రోజు జరిగిన సదస్సులో వీ ప్రకాష్ మాట్లాడుతూ.. బంగారం కన్నా జలం విలువైనదని, నీటిని ఏ ప్రయోగశాలలోనూ తయారు చేయలేమని అన్నారు. జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ది అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 46,000 జల సంఘాలను నియమించి,, వాటి సేవల ద్వారానే నీటి వనరుల అభివృద్ధి సాధ్యమైనదని చెప్పారు. దీంతో తెలంగాణలో వృథాగా ఉన్న 60శాతం భూమి సాగులోకి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పరిశోధనా పత్రాలతో ముద్రించిన ప్రత్యేక సంచికను వీ ప్రకాష్ ఆవిష్కరించారు. తొలిరోజు జరిగిన సదస్సులో స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందనరావు మాట్లాడారు. ఆచార్య రేవతి, ఆచార్య విజయ్, ఆచార్య డైసీ, డా.బాలశ్రీనివాస్, డా.గోపాల సుదర్శనం, డా.వేణు ప్రసాద్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరైన పత్రసమర్పకులు పత్ర సమర్పణ చేశారు. సదస్సులో కళాశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డా.జి.యాదగిరి, డా.రాజేందర్‌సింగ్, డా.డి.టి.చారీ, డా. సౌందర్య సురేశ్, సదస్సు సమన్వయకర్త డా.పావని, సహ సమన్వయ కర్తలు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.