లష్కర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-26T00:41:18+05:30 IST

దీపావళి పండుగను లష్కర్‌ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

లష్కర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

సికింద్రాబాద్‌, మారేడుపల్లి, అక్టోబర్‌, 25(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను లష్కర్‌ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లోని కాలనీలు, బస్తీల్లో వేడుకలు కోలాహలంగా సాగాయి. చిన్నా, పెద్దా అందరూ కలిసి టపాసులు పేల్చి ఆనందంగా గడిపారు. రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కంటోన్మెంట్‌ శాసనసభ్యుడు జి.సాయన్న, కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జె.రామకృష్ణ, పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాద కేశవరెడ్డి, రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌, వైద్య సదుపాయాల సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖరరెడ్డి, కంటోన్మెంట్‌ మాజీ సభ్యులు బి.ప్రభాకర్‌, నళినీకిరణ్‌, కె.పాండుయాదవ్‌, ప్యారసాని శ్యామ్‌కుమార్‌, లోకనాథం తదితరులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మారేడుపల్లిలోని మంత్రి తలసాని నివాసంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన కుమారుడు, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌, మనుమడు సాయితారక్‌ తదితర కుటుంబసభ్యులు టపాసులు పేల్చి, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఘనంగా దీపావళి వేడుకలు

బోయినపల్లి: బోయినపల్లిలో దీపావళి వేడుకలు ప్రజలు ఘనంగా చేసుకున్నారు. బోయినపల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి టపాసులు కాల్చారు. కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మహేందర్‌ రెడ్డితో పాటు మల్లారెడ్డి మనుమడు, మనుమరాళ్లు, కోడలు తదితరులు పాల్గొని సందడి చేశారు.

న్యూబోయినపల్లి బాపూజీనగర్‌ దేవీ నల్లపోచమ్మ, చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయంలో దీపావళి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, పుట్టి నర్సింహ, అజిత్‌కల్యాణ్‌, ప్రేమ్‌ముదిరాజ్‌, నరేందర్‌, శ్రీకాంత్‌, కరణ్‌సింగ్‌, రమేష్‌, జాజుల క్రాంతి, సాయి, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మారేడుపల్లి: దీపావళి పండుగను పురస్కరించుకొని సోమవారం రాత్రి మోండా డివిజన్‌ కార్పొరేటర్‌ కొంతం దీపిక మారేడుపల్లిలోని తన నివాసం లో టపాసులు కాలుస్తూ ఉత్సాహంగా పండుగ సంబురాలు చేసుకున్నారు.

Updated Date - 2022-10-26T00:41:20+05:30 IST