అడ్డంగా దొరికినోళ్లు మొరుగుతారు పట్టించుకోవద్దు
ABN , First Publish Date - 2022-10-28T03:23:44+05:30 IST
అడ్డంగా దొరికిన దొంగలు నొటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారని..
టీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అడ్డంగా దొరికిన దొంగలు నొటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారని.. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున పార్టీ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని గురువారం ట్విటర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.