విలేకరులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి : సబితా

ABN , First Publish Date - 2022-11-09T00:27:30+05:30 IST

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులందరికీ ఆరోగ్య బీమా వర్తింప చేసే విధంగా వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ప్రత్యేక కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

విలేకరులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి : సబితా

రాజేంద్రనగర్‌, నవంబర్‌ 8(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులందరికీ ఆరోగ్య బీమా వర్తింప చేసే విధంగా వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ప్రత్యేక కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అన్ని వివరాలు సేకరించి ఏ రీతిలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలనే విషయంపై త్వరలో కార్యచరణ ప్రణాళిక ఖరారు చేయనున్నట్టు ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంషాబాద్‌కు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు బి.మనోహర్‌ ఆరోగ్య పరిస్థితిని మంగళవా రం ఆమె అడిగి తెలుసుకున్నారు. మనోహర్‌ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. వ్యక్తిగతంగా రూ. లక్ష ఆర్థిక సహాయా న్ని అందించారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా వార్తలను అందిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తున్న విలేకరులలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారని వారి పట్ల మానవతాధృక్పతంతో ఆలోచించాలన్నారు. తమ ప్రభుత్వం మీడియా జర్నలిస్టులకు అండదండలను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి తనయుడు పి.కార్తీక్‌రెడ్డి ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు ఉన్నాడు.

Updated Date - 2022-11-09T00:27:31+05:30 IST