Health Bulleti: వైఎస్ షర్మిల అరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
ABN , First Publish Date - 2022-12-11T13:03:41+05:30 IST
హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల (Sharmila) రెండు రోజులుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద చేస్తున్న ఆమరణ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల (Sharmila) రెండు రోజులుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద చేస్తున్న ఆమరణ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు లోటస్‌పాండ్‌కు చేరుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు.
షర్మిల అరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
షర్మిల అరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆసుపత్రిలో జాయిన్అయ్యారని, లో బీపి, బలహీనత, మైకము ఉండటంతో అడ్మిట్ అయ్యారన్నారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జి చేసే అవకాశముందని చెప్పారు. షర్మిల 2-3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
పాదయాత్రకు అనుమతి, కార్యకర్తల విడుదల కోసం లోటస్ పాండ్ వద్ద వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం కూడా కొనసాగింది. ఆమెకు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, డాక్టర్ ప్రవీణ్ కుమార్ బృందం వైద్యపరీక్షలు నిర్వహించారు. ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారని, గ్లూకోజ్, యూరియా, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని, బ్లడ్ లాక్టేట్ లెవెల్స్ పెరిగాయని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాల్సి ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. అయినా శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ షర్మిల దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి షర్మిల దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.