ISB: ఎంతో విజన్ ఉన్న నేత చంద్రబాబు.. ఐఎస్‌బీ పురోగతి కోసం అపార కృషి

ABN , First Publish Date - 2022-12-16T19:09:48+05:30 IST

ఐఎస్‌బీ (ISB) 20 ఏళ్ల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ISB: ఎంతో విజన్ ఉన్న నేత చంద్రబాబు.. ఐఎస్‌బీ పురోగతి కోసం అపార కృషి

హైదరాబాద్: ఐఎస్‌బీ (ISB) 20 ఏళ్ల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 20 ఏళ్ల క్రితం నాటిన చెట్టును చంద్రబాబు పరిశీలించారు. ఐఎస్‌బీ ఎందరో నాయకులను తయారు చేసిందని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. ప్రభుత్వాలతో కలిసి అనేక నైపుణ్య కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. చంద్రబాబుతో తమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతో విజన్ ఉన్న నేత చంద్రబాబు అని ఐఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు. చంద్రబాబు తీర్చిదిద్దిన సంస్థ అని, ఐఎస్‌బీ పురోగతి కోసం చంద్రబాబు అపార కృషి చేశారని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు తలమానికం ఐఎస్‌బీ అని, ఐఎస్‌బీలో పరిశోధనలకు పెద్దపీట వేశామని డీన్ మదన్‌ పిల్లుట్ల తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్‌బీ పేరు గడించిందని, ఐఎస్‌బీ విద్యార్థులు వివిధ దేశాల్లో రాణిస్తున్నారని, కీలక సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని డీన్ మదన్‌ వెల్లడించారు.

Updated Date - 2022-12-16T19:11:57+05:30 IST