కళ్లెం శ్రీనివాస్‌రెడ్డికి లయన్స్‌ క్లబ్‌ ఎక్సలెంట్‌ జోన్‌ చైర్మన్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-07-12T15:51:46+05:30 IST

ఎర్రగడ్డకు చెందిన లయన్‌ కళ్లెం శ్రీనివాస్‌ రెడ్డికి ఎక్సలెంట్‌ జోన్‌ చైర్మన్‌ అవార్డు లభించింది.

కళ్లెం శ్రీనివాస్‌రెడ్డికి   లయన్స్‌ క్లబ్‌ ఎక్సలెంట్‌ జోన్‌ చైర్మన్‌ అవార్డు

ఎర్రగడ్డ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డకు చెందిన లయన్‌ కళ్లెం శ్రీనివాస్‌ రెడ్డికి ఎక్సలెంట్‌ జోన్‌ చైర్మన్‌ అవార్డు లభించింది. ఏఎంఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ టి.రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా కళ్లెం శ్రీనివాస్‌ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 2021-22 సంవత్సరానికి గాను కళ్లెం శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ఉత్తమ సేవలు, లయన్స్‌ క్లబ్‌ జోన్‌ పరిధిలోని 4 క్లబ్బులను సమన్వయం చేసుకుంటూ వారితో సేవా కార్యక్రమాలు చేస్తూ, సలహాలు, సూచనలు ఇచ్చినందుకుగాను తనకు ఈ అవార్డు లభించిందని లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ కళ్లెం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. అంతేకాకుండా నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులలో రోగుల బంధువులకు అనుకూలంగా ఉండేలా 60 బెంచీల ఏర్పాటు, పలువురికి క్యాటరాక్ట్‌ సర్జరీలు చేయించానని తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-07-12T15:51:46+05:30 IST