Minister KTR: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై ట్విటర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు
ABN , First Publish Date - 2022-09-22T18:33:42+05:30 IST
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విటర్లో సెటైర్లు వేశారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Lakshman)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విటర్ (Twitter)లో సెటైర్లు వేశారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో ఎంపీ లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని, గరీబు యూపీ సోకులు పడుతోందన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణ దోహదపడుతున్నందుకు థాంక్స్ చెప్పాలన్నారు. లెక్కలు తెలుసుకొని.. ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎంపీ లక్ష్మణ్ ప్రజలను మభ్యపెట్టొద్దని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా హితవు పలికారు.