TS News: నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు అభినందనలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-12-20T16:04:25+05:30 IST

హైదరాబాద్: నకిలీ మద్యాన్ని (Fake alcohol) పట్టుకున్న అధికారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ (Minister Srinivas Goud) అభినందనలు తెలిపారు.

TS News: నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు అభినందనలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: నకిలీ మద్యాన్ని (Fake alcohol) పట్టుకున్న అధికారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ (Minister Srinivas Goud) అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకెళ్లి.. ఒడిశాలోని కటక్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు అయ్యిందన్నారు. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా తయారు చేస్తున్నారని, రూ. రెండున్నర కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నారు. నకిలీ మద్యం అమ్మకాలు, తయారు చేసేవారిని వదిలిపెట్టమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఎవరికైనా మద్యం అమ్మకాలపై ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Updated Date - 2022-12-20T16:04:28+05:30 IST