Raghunandan Rao: మంత్రి తప్పు చేయకపోతే ఫోన్‌ను ఎందుకు దాచారు?..
ABN , First Publish Date - 2022-11-23T13:07:29+05:30 IST
బాధ్యతాయుతంగా ఉన్న మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) చట్టాన్ని గౌరవించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) సూచించారు.
హైదరాబాద్: బాధ్యతాయుతంగా ఉన్న మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) చట్టాన్ని గౌరవించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) సూచించారు. మంత్రి, ఆయనకు సంబంధించిన వారి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులకు ఫిర్యాదు వచ్చినప్పుడు ఎవరి ఇంటిపై అయినా సోదాలు చేసే అధికారం ఉంటుందన్నారు. సంస్థలు చట్టప్రకారం నడుపుతున్నప్పుడు, తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్ డస్ట్ బిన్‌లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. చట్టం దృష్టిలో తప్పు చేసిన వ్యక్తి శిక్షణను అనుభవించాలని, చట్టాన్ని ఎదుర్కోవాలని అన్నారు.
నోటీసులు ఇవ్వగానే గుండెనొప్పులు వస్తున్నాయా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉన్నవారే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం అండతో అక్రమంగా సంపాదించుకున్నవారిపైనే దాడులు జరుగుతాయన్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన ఉందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు.