Raghurama: కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2022-11-16T12:26:11+05:30 IST
హైదరాబాద్: పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
హైదరాబాద్: పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ దంపతులు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, నటులు కోట శ్రీనివాసరావు, రఘుబాబు నివాళులర్పించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్టూడియో నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర సాగనుంది. మూడు గంటలకు కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
మరోవైపు పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అభిమాన హీరో కడచూపు కోసం పెద్దఎత్తున అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివచ్చారు. అయితే అరగంటకుపైగా అభిమానులను నిలిపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు తోసుకుని లోపలకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు నిలువరించలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.