Munawar Faruqi: అటు షో.. ఇటు అరెస్ట్‌లు.. సాయంత్రానికి ఏం జరుగనుందో?

ABN , First Publish Date - 2022-08-20T16:39:05+05:30 IST

మునావర్ ఫారుఖీ స్టాండ్ అప్ కామెడీ షోకు శిల్పకళావేదికలో ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి.

Munawar Faruqi: అటు షో.. ఇటు అరెస్ట్‌లు.. సాయంత్రానికి ఏం జరుగనుందో?

హైదరాబాద్: మునావర్ ఫారుఖీ (Munawar Faruqi) స్టాండ్ అప్ కామెడీ షోకు శిల్పకళావేదిక (Shilpakala vedika)లో ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి. మునావర్ స్టాండ్ అప్ కామెడీ షో (Munavar stand up comedy show)కు మాదాపూర్ పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే బుక్ మై షో (Book My Show)లో షో టికెట్స్  పూర్తిగా అమ్ముడుపోయాయి. కాగా... మునావర్ షో (Munawar show)ను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh), బీజేవైఎం నేతలు (BJYM Leaders) స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని రాజాసింగ్ (BJP MLA) హెచ్చరించారు.


ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రతా చర్యల దృష్ట్యా శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదాస్పదంగా మారాయి. కర్ణాటక (Karnataka)లో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్ (Munavar show ban) కొనసాగుతోంది. హైదరాబాద్‌ (Hyderabad)లోనూ మునావర్ షోలు నిర్వహించకూడదంటూ రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


మునావర్ ఫారుఖీ షోకు అనుమతులు ఉన్నాయి: మాదాపూర్ డీసీపీ

మునావర్ ఫారుఖీ షో (Munawar Faruqi Show) కు అనుమతులు ఉన్నాయన్నాయని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి  (DCP Shilpavalli) తెలిపారు.  ప్రజాస్వామ్యంలో ఎవరైనా షోలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు పోలీసులు అన్ని‌చోట్ల బందోబస్తు ఉంటుందని డీసీపీ (DCP) వెల్లడించారు. 


బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక...

కాగా... మునావర్ షోను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja singh) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షోను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.  బీజేవైఎం కార్యకర్తలు ఇప్పటికే షో టికెట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది...  షో జరిగిన పక్షంలో వేదికను తగులబెడతామంటూ ఎమ్మెల్యే (MLA) హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మునావర్ షోను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అనుమతి లభించింది. అటు షో... ఇటు రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో సాయంత్రానికి ఏం జరుగనుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 


Updated Date - 2022-08-20T16:39:05+05:30 IST