పాస్‌పోర్టు సేవలు పారదర్శకం

ABN , First Publish Date - 2022-11-16T00:24:53+05:30 IST

పాస్‌పోర్టు కోసం దరఖాస్తుదారుల దళారులను అశ్రయించొద్దని, పాస్‌పోర్టు సేవలు పారదర్శకంగా అందిస్తున్నట్లు హైద్రాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.

పాస్‌పోర్టు సేవలు పారదర్శకం

హైదరాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి బాలయ్య

రెజిమెంటల్‌బజార్‌, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్టు కోసం దరఖాస్తుదారుల దళారులను అశ్రయించొద్దని, పాస్‌పోర్టు సేవలు పారదర్శకంగా అందిస్తున్నట్లు హైద్రాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయు విధానం వివరించారు.

దరఖాస్తు విధానం

పాస్‌పోర్టు సేవ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తరువాత లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌తో www.passportindia.gov.in.లో క్లిక్‌ చేసి అప్లై ఫ్రెష్‌ పాస్‌పోర్టు/ రీ ఇష్యూ పాస్‌ పోర్టు లింక్‌ ఒపెన్‌ చేసి వివరాలు నమోదు చేసి అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నెంబర్‌ (ఏఆర్‌ఎన్‌)ను జనరేట్‌ చేసుకోవాలి.

పే అండ్‌ షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌ లింక్‌లో సబ్‌మిట్‌ చేయాలి. ఫీజు చెల్లించి, అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ ప్రింట్‌ లేకుంటే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో అనుమతించరు.

ఏఆర్‌ఎన్‌లో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్స్‌ జిరాక్స్‌ల పై దరఖాస్తుదారులు సంతకాలు చేయాలి. గెజిటెడ్‌ సంతకం అవసరం లేదు.

ప్రభుత్వ ఉద్యోగులు ఆయితే అనెక్చర్‌-ఏ, లేదా అనెక్చర్‌-జిలో వివరాలు నమోదు చేయవలసి ఉంటుం ది. ఐడీ కార్డు కూడా జతచేయాలి.

తత్కాల్‌ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకునేవారు 13 డాక్యుమెంట్లలో 3 తప్పనిసరిగా జతచేయాలి. అందు లో ఒకటి ప్రసుత్త చిరునామా ఉండాలి.

ఫ పేరు, ఇంటి పేరు వివరాలను జాగ్రత్తగా నింపాలి. ఇప్పటికే ఉన్న పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకుంటే డిక్లరేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలి.

రీ ఇష్యూలో దరఖాస్తు చేసుకునే వారు పాస్‌పోర్టు తీసుకున్న సంవత్సరం లోపే చేసుకోవాలి.

పీసీసీ దరఖాస్తుదారులు జీవిత భాగస్వామి పేరు, లేదా చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒరిజినల్‌ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌, అడ్రస్‌ ప్రూఫ్‌ జత చేయాలి.

ప్రస్తుతం అపాయింట్‌మెంట్‌ కోసం 35-40 రోజుల సమయం పడుతున్నందున దరఖాస్తుదారులు ముందే దరఖాస్తు చేసుకావాలి.

విదేశాలకు వైద్యం, చదువు, ఉద్యోగం కోసం వెళ్లే వారికి డాక్యుమెంట్లు పరిశీలించి ప్రాధాన్యం ఇస్తారు.

పాస్‌పోర్టు పొందిన తర్వాతే టికెట్లు బుక్‌చేసుకోవాలి.

Updated Date - 2022-11-16T00:24:55+05:30 IST