రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి
ABN , First Publish Date - 2022-08-23T06:00:15+05:30 IST
రాజాబహదూర్ వెంకట రామిరెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్) 153వ జయంత్యుత్సవాలు సోమవారం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రాజాబహదూర్ వెంకట రామిరెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్) 153వ జయంత్యుత్సవాలు సోమవారం నారాయణగూడలోని వైఎంసీఏ సర్కిల్‌లో జరిగాయి. రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై నారాయణగూడలోని వెంకటరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఈఆర్‌టీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, కె.రామచంద్రారెడ్డి, రెడ్డి బాలికల హాస్టల్ అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, సెక్రటరీ మట్టారెడ్డితో పాటు విద్యార్థులు హాజరయ్యారు. పోలీస్ శాఖలో విధుల నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సీసీఎస్ ఎస్‌ఐ మదన్‌కుమార్ గౌడ్, సైబరాబాద్‌లోని ఆమన్‌గల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావులకు ఆర్‌బీవీఆర్‌ఆర్, కేవీరంగారెడ్డి పేరిట రూ. 5వేల నగదు పురస్కారాన్ని అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో..
నార్సింగ్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనవాసరావు వెంకటరామిరెడ్డి విగ్రహానికి నివాళిలర్పించారు. కార్యక్రమంలో జేడీ రమే్‌షనాయుడు, డీడీలు నవీన్‌కుమార్, జానకి షర్మిల, గిరిధర్, రాఘవేందర్‌రెడ్డి, శ్రీరాములు, రఘురావు, శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతర అకాడమీ సిబ్బందిని సన్మానించారు.