Sharmila: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ సమాధానం చెప్పాలి?..

ABN , First Publish Date - 2022-12-06T11:33:18+05:30 IST

అంబేద్కర్ (Ambedkar) 66వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) టాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Sharmila: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ సమాధానం చెప్పాలి?..

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) 66వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) టాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ తరఫున అంబేద్కర్‌కు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీలకు ఇంకా అన్యాయం జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాటల్లో ఉన్న చిత్తశుద్ది చేతల్లో కనపడడం లేదని విమర్శించారు. చేవెళ్ల ప్రాజెక్ట్‌ (Chevella Project)కు అంబేద్కర్ పేరు పెడితే ముఖ్యమంత్రి దాన్ని తీసేశారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, దళితులను తక్కువగా చూడడం సీఎం నైజమని అన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. బతుకమ్మ ఆడుతూనే కవిత లిక్కర్‌ స్కామ్‌కు తెరలేపారని, కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో నాటకానికి తెర లేపుతున్నారని షర్మిల విమర్శించారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలన్నారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే ఉచిత విద్యుత్‌పై సంతకం పెట్టారన్నారు. తన అరెస్ట్ పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. తన అరెస్ట్ పట్ల స్పందించిన వారందరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-06T11:33:21+05:30 IST