Super Star Krishna, Daughter Manjula: జీవించడం ఎలాగో చేతల్లో చూపావు..
ABN , First Publish Date - 2022-11-16T04:20:23+05:30 IST
నువ్వే నా బలం, నా హీరో. నువ్వు నాపై చూపిన ప్రేమ అంతులేని సముద్రం. నువ్వు లేవంటే.. ఉదయం 11 గంటలకు మన మధ్య ఫోన్ సంభాషణలు,
‘‘నువ్వే నా బలం, నా హీరో. నువ్వు నాపై చూపిన ప్రేమ అంతులేని సముద్రం. నువ్వు లేవంటే.. ఉదయం 11 గంటలకు మన మధ్య ఫోన్ సంభాషణలు, మధ్యాహ్న భోజనాలు ఇక ఉండవంటే.. చాలా కోల్పోయినట్లుంది. ఇది నాకు ఎప్పటికీ జీర్ణించుకోలేని చేదు నిజమే. మిగతా అందరికీ ఎలాగో మాకూ అలాగే నువ్వో సూపర్ స్టార్‌వి..! కానీ, ఇంట్లో నువ్వొక ప్రేమపూర్వక, సగటు నాన్నవు. నిత్యం మా తోడుగా నిలిచావు. ఎంత పని ఒత్తిడి ఉన్నా, మాకు సమయం ఇచ్చావు. మాకేం అవసరమో గుర్తించి అడగకుండానే సమకూర్చావు. జీవితం గురించి నువ్వెప్పుడూ మాకు ఉపన్యాసాలు ఇవ్వలేదు. నీ చేతల ద్వారా చెప్పకనే చెప్పావు. నిజాయతీ, నిరాడంబరత, దూరదృష్టి, సమయపాలన, క్రమశిక్షణ, దాతృత్వంలో నీకెవరూ సాటిలేరు. నీ వారసత్వం, సినీ రంగానికి చేసిన సేవ చిరస్థాయిగా నిలిచిపోతాయి నాన్న.
...నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను నాన్న.