సూర్యాపేట డీపీతో డీఎంహెచ్‌వోకు టోకరా
ABN , First Publish Date - 2022-10-24T06:00:39+05:30 IST
సైబర్ కేటుగాళ్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ...

1.40 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
సూర్యాపేట, అక్టోబరు 23: సైబర్ కేటుగాళ్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ పేరుతో జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ కోటాచలానికి రూ. 1.40 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కోటాచలం వాట్సా్‌పకు ఓ సందేశం వచ్చింది. ‘‘నేను జిల్లా కలెక్టర్‌ని. అమెజాన్‌లో రూ. 1.40 లక్షల విలువ చేసే వస్తువులు కొనేందుకు ఆర్డర్ పెట్టాను. ఆ డబ్బు చెల్లించాలి’’ అనేది అందులోని సారాంశం. మెసేజ్ వచ్చింది కొత్త నంబర్ నుంచే అయినా.. డీపీ కలెక్టర్ హేమంత్ కేశవ్‌దే ఉండడంతో కోటాచలం ఆరుగురు వ్యక్తుల ద్వారా ‘అమెజాన్ పే’కు రూ. 1.40 లక్షలు పంపారు. ఆ తర్వాత అదే నంబర్ నుంచి మరో రూ.20వేలు పంపాలంటూ మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన కోటాచలం.. ఆ నంబర్‌కు కాల్ చేయగా.. స్విచ్ఛా్‌ఫలో ఉన్నట్లు గుర్తించారు. దాంతో.. అది సైబర్ నేరగాళ్ల పనిగా అనుమానించి, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.