Vijayashanthi: కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లాలనే ఆశతో... పక్క రాష్ట్రాల పార్టీలు తెలంగాణకు వచ్చే కార్యాచరణ

ABN , First Publish Date - 2022-12-21T23:27:09+05:30 IST

సీఎం కేసీఆర్‌ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.

Vijayashanthi: కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లాలనే ఆశతో... పక్క రాష్ట్రాల పార్టీలు తెలంగాణకు వచ్చే కార్యాచరణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. కారణాలు ఏవైనా... కేసీఆర్ బీఆరెస్ ఆలోచన ప్రారంభించిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా మారుతూ వస్తున్నాయని ఆమె అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..

'కారణాలు ఏవైనా... కేసీఆర్ గారు బీఆరెస్ ఆలోచన ప్రారంభించిన నాటి నుండీ తెలంగాణ రాజకీయాలు ప్రాంతేతర పార్టీల ప్రయోగశాలగా మారుతూ వస్తున్నయి. తెలంగాణ వచ్చినది మొదలు... ఎన్నో వైపరీత్య, విచిత్రాలను తెలంగాణ ప్రజలకు ఎనిమిదేళ్లుగా చూపిస్తూనే ఉన్న కేసీఆర్ గారి మరో సాధన ఇది. ఆయన అత్యాశ ప్రేరేపిత దుర్మార్గ ధోరణికి సమాధానం... మా ఉద్యమకారుల మరో పోరాటమే కావచ్చు కూడా... ఒక్క మాటలో చెప్పాలంటే... కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్లాలనే ఆశతో... పక్క రాష్ట్రాల పార్టీలు తెలంగాణకు వచ్చే కార్యాచరణ చేస్తున్నరు.' అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2022-12-21T23:28:39+05:30 IST