YS Sharmila: టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది గూండాలు.. రౌడీలే
ABN , First Publish Date - 2022-11-29T15:03:19+05:30 IST
టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది గూండాలు...రౌడీలే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది గూండాలు...రౌడీలే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. పోలీసుల అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నప్పటికీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమపై దాడులు చేసి.. వాహనాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. అన్ని వాళ్లే చేసి.. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నామంటున్నారన్నారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యలు చేశారు. ‘‘నా పాదయాత్రను ఆపేందుకే ప్రభుత్వం కుట్రలు’’ చేస్తోందని షర్మిల (YSRTP Chief) ఆరోపించారు.