Rajanna Sirisilla: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-12-05T08:44:33+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ(Vemulawada) రాజన్న ఆలయానికి భక్తులు

Rajanna Sirisilla: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Rajanna Sirisilla: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ(Vemulawada) రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక కరోనా సమయంలో మూతపడిన ధర్మగుండం ఆదివారం (నిన్న) పున:ప్రారంభించారు. కరోనా వల్ల 32 నెలల పాటు ధర్మగుండంలో పుణ్య స్నానాలకు భక్తులు నోచుకోలేదు. దీంతో ధర్మగుండంలో స్నాన్నాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

Updated Date - 2022-12-05T08:44:40+05:30 IST