రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం
ABN , First Publish Date - 2022-11-03T23:52:51+05:30 IST
రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) అభయ్‌కుమార్ గుప్తా సందర్శించారు.
అంతర్గాం, నవంబరు 3: రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) అభయ్‌కుమార్ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంలు, రైల్వే కాలనీ తిరిగి పరి శీలించారు. అనంతరం రన్నింగ్ రూమ్‌ను సందర్శించి అక్కడ మహిళా లోకో పైలట్స్, గార్డుల కోసం నిర్మించిన విశ్రాంతి గదులను పరిశీలించారు. ఈనెల 17న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రామగుండానికి రానున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పలు విభాగాల్లోని పనులను తనిఖీ చేశారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానిక రైల్వే అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు మనోజ్‌కుమార్, వెంకటపతి రాజు, ఎం ఉపాధ్యాయ్, రవికుమార్, ఆర్‌పీఎఫ్ సీఐ సురేష్‌గౌడ్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.