రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన జీఎం

ABN , First Publish Date - 2022-11-26T00:07:01+05:30 IST

రామగుండం రైల్వే స్టేషన్‌ను శుక్రవా రం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సందర్శించారు.

రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన జీఎం

అంతర్గాం, నవంబరు 25: రామగుండం రైల్వే స్టేషన్‌ను శుక్రవా రం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సందర్శించారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీఎం రామ గుండం రైల్వేస్టేషన్‌ ఏరియాలోని రన్నింగ్‌ రూమ్‌ వద్ద మహిళా లోకో పైలట్ల కోసం నిర్మించిన విశ్రాంతిగదులు, చిల్డ్రన్స్‌ పార్కు, ఆర్‌ వోహెచ్‌ షెడ్డు వద్ద నిర్మించిన కాన్ఫరెన్స్‌ హాల్‌ను ప్రారంభోత్సవం చేశారు. మహిళా లోకోపైలట్స్‌తో మాట్లాడుతూ సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. నూతన గూడ్స్‌రైలును జెండా ఊపి ప్రారంభించారు. సుల్తానాబాద్‌, మెట్‌పల్లిలో నిర్మించిన వెయింగ్‌ బ్రిడ్జిలను కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేష న్‌ ప్లాట్‌ఫాంలను పరిశీలించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ప్రయాణీకులు, కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధి కారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రామగుండంలో పలు ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు నిలుపాలని, మరికొన్ని ఇతర స్థానిక సమస్యలపై రామ గుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, రైల్వే బోర్డు మెంబర్‌ క్యాతం వెంకటరమణ, స్థానిక కార్పొరేటర్‌ కన్నూరి సతీష్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకుడు పెండ్యాల మహేష్‌ జీఎంకు వినతిపత్రాలు అందజేశా రు. పలు కార్మికుల సమస్యలపై మజ్దూర్‌ యూనియన్‌, సంఘ్‌ నా యకులు వినతి పత్రం అందజేశారు. ఆర్‌ఓహెచ్‌ షెడ్డు వద్ద జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌ గుప్తా మొక్కలు నా టారు. ఈకార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు ధనుంజయ్‌, మనో జ్‌కుమార్‌, స్టేషన్‌ మాస్టర్‌ రవీందర్‌, ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేష్‌గౌడ్‌, డబ్ల్యూఈఎన్‌ ఉపాధ్యాయ్‌, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ భానుచందర్‌, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T00:07:05+05:30 IST