ఘనంగా మహాసరస్వతి పూజ

ABN , First Publish Date - 2022-10-03T05:52:44+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం పుస్తక రూపిణి మహాసరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ద సప్తమి సందర్భంగా రాజరాజేశ్వరిదేవి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఘనంగా మహాసరస్వతి పూజ
కాళరాత్రి అలంకారంలో అమ్మవారు

- కాళరాత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం

వేములవాడ, అక్టోబరు 2:  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం పుస్తక రూపిణి మహాసరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు.  శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ద సప్తమి సందర్భంగా  రాజరాజేశ్వరిదేవి అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి అభ్యంగన స్నానం, మహాభిషేకం, లలిత సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజలు నిర్వహించారు. మూలానక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు పుస్తక రూపిణి మహాసరస్వతి పూజ, సాయంత్రం అష్టావధాని తిగుళ్ల శ్రీహరిశర్మ శ్రీదేవి భాగవత పురాణ ప్రవచనం, కన్యకాసువాసిని పూజ నిర్వహించారు. బాలాత్రిపురసుందరి అమ్మవారు, మహిషాసుర మర్ధిని అమ్మవారు, బద్దిపోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు  చేశారు.  

Updated Date - 2022-10-03T05:52:44+05:30 IST