వంద కోట్లతో కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు
ABN , First Publish Date - 2022-12-09T00:44:37+05:30 IST
సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవ స్థానం అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం గర్వకారణంగా ఉందని త్వరలోనే యాదాద్రి తరహాలో ఆలయం వెలిగిపోనుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అ న్నారు.
ఫఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఫసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
మల్యాల, డిసెంబరు 8: సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవ స్థానం అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం గర్వకారణంగా ఉందని త్వరలోనే యాదాద్రి తరహాలో ఆలయం వెలిగిపోనుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అ న్నారు. కొండగట్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది వరకే దాదాపు రూ. 30 కోట్ల తో అభివృద్ది పనులు చేపట్టామని, తాజాగా వంద కోట్లు ఇచ్చిన కేసీఆర్ త్వర లోనే వచ్చి మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నారని తెలిపారు. ఆలయానికి ఈశ న్యంలో రెండు వరసల రహదారి, సెంట్రల్‌లైటింగ్ దేవస్థానానికి గల సుమారు నాలుగు వందల ఎకరాల భూమిలో చారిత్రాత్మక అభివృద్ది చేయనున్నట్లు తెలి పారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాధన్యం వహించిన ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మంత్రిగా పని చేసినప్పటికీ దేవస్థానం అభివృద్దికి ఏమాత్రం కృషి చేయ లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుత ఎంపీ, బండి సంజయ్ నియోజకవర్గం లో గల కొండగట్టుకు సీఎం కేసీఆర్ వంద కోట్లు ప్రకటించినట్లు ప్రధాని మోదిచే రెండు వందల కోట్ల నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్ర కొండగట్టు దాటే లోపే నిధులు తీసుకురావాలని అన్నారు. తరువాతే ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలన్నారు. అసలు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందని కనీసం తాగు, సాగు నీరు, ప్రాజెక్టులు అందించడం చేతకాని వాళ్లు సీఎం కేసీఆర్, కేసీ ఆర్ కుటుంబాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడి గా, ఎంపీగా కాళేశ్వరానికి జాతీయహోదా తీసుకురావాలని అది కూడా తన పా దయాత్రలో చొప్పదండి నియోజకవర్గం దాటక ముందే హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో వచ్చె నెలలో అయిదు వందల మందికి, మే నాటికి మరో వెయ్యి మందికి దళితబంధు యూనిట్లు అందించ నున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వంద కోట్లు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దిగువ కొండగ ట్టులోనూ స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపెల్లి విమల, జడ్పీటీసీ కె. రామ్మోహన్‌రావు, మ ల్యాల, కొడిమ్యాల మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సుదర్శన్, కృష్ణరావు సర్పంచ్ తిరుపతిరెడ్డి పాలక మండలి సభ్యులు కొంక నర్సయ్య, ప్రవీన్, సురేం ధర్, లింగాగౌడ్, సింగిల్ విండో చైర్మన్లు సాగర్‌రావు, రాంలింగారెడ్డి, మధుసూ ధన్‌రావు, రాజనర్సింగరావు, జనగాం శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.