కొండా లక్ష్మణ్ బాపుజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-09-28T05:51:18+05:30 IST
కొండా లక్ష్మణ్ బాపుజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
కోరుట్ల, సెప్టెంబరు 27 : కొండా లక్ష్మణ్ బాపుజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పట్ట ణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య - అనిల్‌తో పాటు స్థానిక నాయకు లతో కలిసి పూలమాల వేసి నివాళ్లను అర్పించారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. గొప్ప పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని అ న్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ పవన్, కౌన్సిలర్లు నాగభూషణం, లక్ష్మినారాయణ, పద్మశాలి సంఘ నాయకులు ప్రకాష్, ప్రసాద్, మధు, అర్పించారు.