‘మన ఊరు మన బడి’ పకడ్బందీగా అమలుచేయాలి
ABN , First Publish Date - 2022-04-24T05:29:43+05:30 IST
జిల్లా లో మన ఊరు మన బడి కార్య క్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సంగీతసత్య నారాయణ సంబంధిత అధికా రులను ఆదేశించారు.
- కలెక్టర్ సంగీత సత్యనారాయణ
ధర్మారం, ఏప్రిల్ 23: జిల్లా లో మన ఊరు మన బడి కార్య క్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సంగీతసత్య నారాయణ సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం మన ఊరు మన బడి కార్యక్ర మానికి ఎంపికైన మండలం లో ని ఖిలావనపర్తి, కానంపెల్లి ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశా లలను, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. మన ఊరు మన బడిలో భాంగంగా చేపట్టాల్సిన ఐదు అంశా ల ప్రతిపాదనలను ఏఈ, ఈఈలు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానో పాధ్యాయుని ద్వారా పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు, తరగతి గదుల నిర్మాణం, డైనింగ్ హాల్, టాయిలెట్ల నిర్మాణం, తాగు నీరు, విద్యుత్ పనులు చేపట్టాని సూచించారు. పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధి కారి మాధవి, ఈఈ పీఆర్ మునిరాజు తదితరు లు పాల్గొన్నారు.