సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులపై ప్రభుత్వం మొద్దు నిద్ర

ABN , First Publish Date - 2022-11-23T00:19:17+05:30 IST

మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల వరప్రదాయిని సూరమ్మ ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువల పనులు ప్రారంభించడంలో కేసీఆర్‌ స ర్కారు మొద్దు నిద్ర పోతోందని పీసీసీ కార్యదర్శి ఆరోపించారు.

సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులపై ప్రభుత్వం మొద్దు నిద్ర
ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఫ పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, నవంబర్‌ 22 : మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల వరప్రదాయిని సూరమ్మ ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువల పనులు ప్రారంభించడంలో కేసీఆర్‌ స ర్కారు మొద్దు నిద్ర పోతోందని పీసీసీ కార్యదర్శి ఆరోపించారు. మంగళవారం మండలంలోని సూరమ్మ ప్రాజెక్ట్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులతో కలసి 27వ నిరసన తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదు సంవత్సరాల కిందట అప్పటి భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు శిలాఫలకం వేసి రు. 206 కోట్లు మంజూరు చేసినట్టు గొప్పలు చెప్పుకుని ఎన్నికల్లో ఓట్లు దండుు న్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా తీయక ఇక్కడి రైతులను నమ్మించి మోసగించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో నిరసన లు వ్యక్తం చేస్తూ ఆర్‌డీవో, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించినా సర్కారు దున్న పోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరిస్తోందన్నారు. కుడి, ఎడమ కాలు వల పనులు పూర్తి చేసి 40 వేల ఎకరాలకు నీరందించేదాకా ప్రభుత్వంపై పోరా టాలు చేస్తూనే ఉంటామన్నారు. మత్తడి తెగిపోయి నెలల తరబడి నీరంతా ప్రా జెక్ట్‌ నుంచి వృధాగా పోయినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ సభ్యు డు తొట్ల అంజయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, పులి హరిప్రసాద్‌, మార్కం రాజేశం, అ ల్లకుంట లింగంగౌడ్‌, ఉరుమల్ల కృష్ణమాచారి, గోవింద్‌ నాయక్‌, గంగాధర్‌, చెలు కల తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, సంజీవ్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-23T00:19:19+05:30 IST