రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-10T00:28:00+05:30 IST

రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగా ణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ పని చేస్తోందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మంథని, నవంబర్‌ 9: రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగా ణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ పని చేస్తోందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. స్థానిక ఏఎంసీ యార్డులో, మండలంలోని గోపాల్‌పూర్‌ గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పుట్ట మధు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, రూ. 5 లక్ష ల రైతు బంధు, సకారంలో ఎరువులు, విత్తనాల సరఫరా, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు... ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం..

మండంలోని చిన్నఓదాలలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠ శాల భవనం, మరో రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను పుట్ట మధు ప్రారంభించారు. చిన్న ఓదాల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు వేముల శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పుట్ట మధు సక్షమంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి పుట్ట మధు పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. వేర్వురుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత-శంకర్‌లా ల్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళ పు శంకర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-10T00:28:08+05:30 IST