TS News: పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ABN , First Publish Date - 2022-11-19T09:24:27+05:30 IST
జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మెయిన్ బాయిలర్ ట్యూబ్ లీకేజితో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా కేటీపీఎస్‌లో తరచుగా సాంకేతిక సమస్యలతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. కేసీఆర్ హయాంలో నిర్మాణం చేసిన తొలి విద్యుత్ ప్లాంట్ ఇది. అయితే నాసిరకం నిర్మాణంతోనే విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.