Ponguleti: పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్లోనే ఉంటా
ABN , First Publish Date - 2022-12-26T18:49:34+05:30 IST
తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ (BRS) లోనే ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు.
మణుగూరు: తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ (BRS) లోనే ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. ‘‘నేను పార్టీ మారడంలేదు.. విప్ రేగా కాంతారావు (Rega Kantha Rao) చేసిన వ్యాఖ్యలపై స్పందిచను. ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. మాట్లాడే హక్కు ఉంది. ప్రతీ కామెంట్‌కు నేను స్పందించను. అన్నిటికి కాలమే సమాధనం చెబుతుంది’’ అని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నంత కాలం ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు అగౌరవంగా మాట్లాడినా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా పార్టీకి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధినాయకత్వం గీసిన గీతను దాటనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉన్నాయని, ప్రజల అభీష్టం మేరకు కచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.