Konda Surekha: సీబీఐ భయంతోనే కవిత ‘జాగృతి’ నినాదం
ABN , First Publish Date - 2022-12-13T19:45:34+05:30 IST
Warangal: సీఎం కేసీఆర్ (CM KCR), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని..భారతదేశాన్ని
Warangal: సీఎం కేసీఆర్ (CM KCR), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని..భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. అటు జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత రూ.కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జాగృతిని ఆమె పట్టించుకోలేదన్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో తనపై అభియోగాలు రావడంతో మళ్ళీ జాగృతి నినాదం అందుకుందని విమర్శించారు. సీబీఐ తనను అరెస్టు చేస్తుందేమోన్న భయం కవితను వెంటాడుతుందని, అందుకే జాగృతిని అడ్డుపెట్టుకుని సీబీఐ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.