Konda Surekha: అనూహ్య నిర్ణయం వెనుక ఆలోచన ఇదే!

ABN , First Publish Date - 2022-12-11T17:06:26+05:30 IST

వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Konda Surekha: అనూహ్య నిర్ణయం వెనుక ఆలోచన ఇదే!
Konda Surekha

వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్‌లో తన పేరు లేదని, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని సురేఖ చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్‌లో తనకంటే జూనియర్లను నామినేట్ చేశారని ఆమె ఆరోపించారు. తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం బాధ కలిగించిందన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనను నియమించడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని లేఖలో రాశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ లోనే సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ గతంలో పరకాల, శాయంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెబుతున్నా కొండా సురేఖ అతి త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ భర్త కొండా మురళి ఎమ్మెల్సీ. కుమార్తె సుష్మితా పటేల్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు తలపోస్తున్నారు.

Updated Date - 2022-12-11T17:25:48+05:30 IST