Home » Revanth
కుల గణనతో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలుస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అన్ని కులాల వారు సమానమని, అందరికీ సమాన అవకాశాలు రావాలని సంకల్పించారని గుర్తుచేశారు. కుల గణన చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటే కారణం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాలు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన.. పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
రూ. 500 కాగితం తీసుకుని కూరగాయల మార్కెట్కు వెళ్లితే.. పట్టుమని మూడు రకాలు కాయగూరలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు సైతం ఇదే తరహాలో కొనసాగుతున్నాయని వారు వివరిస్తున్నారు.
రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఈ కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ(సీఎంఆర్ఎఫ్)నిధికి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు.
వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు.
ప్రపంచంతోనే పోటీపడేలా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ను తిట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొద్దు గడవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.
హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.