పాలమూరు అభివృద్ధికి నిరంతర కృషి
ABN , First Publish Date - 2022-04-04T04:38:03+05:30 IST
పాలమూరు అభి వృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 : పాలమూరు అభి వృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎవ రెన్ని అవాంతరాలు సృష్టించినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు అండగా ఉం టానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మహ బూబ్‌నగర్ మునిసిపాలిటీ పరిధిలో రూ.30 కోట్ల కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా 18వ వార్డులోని అరబ్‌గట్టిలో రూ.20 లక్షలతో చేప డుతున్న సీసీ రోడ్డు, డ్రైౖనేజీ పనులకు శంకుస్థా పన చేశారు. అదేవిధంగా ప్రేమ్‌నగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనం తోపాటు వార్డులో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యాన్ని మంత్రి ప్రారంభించారు. 16వ వార్డు బోయపల్లిలో మైనారిటీ కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీని మైనారిటీ సోదరు లకు అందజేశారు. ఆయా వార్డుల్లో ప్రజలను ఉద్దే శించి మంత్రి మాట్లాడారు. అన్నివార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్రజలు దగ్గరుండి పనులు చేయించుకోవాలన్నారు. అన్ని కులాలకు కమ్యూని టీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. విడ తల వారిగా అన్ని పనులు పూర్తవు తాయని, ప్రతీ గల్లీకి సీసీరోడ్డు, డ్రైనేజీ వేయిస్తా మని అన్నారు. సమస్యలు ఏమున్నా కౌన్సిలర్‌కు లేదంటే నేరుగా తనకు విన్నవించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహు లు. కౌన్సిలర్లు మోతీలాల్, కిశోర్, మాజీ కౌన్సిలర్ గంజి వెంకన్న, శరత్‌చంద్ర, నాయకులు శ్యామ్ సుందర్‌గౌడ్, వెంకట్రాములు, ఆంజనేయులు, షకీల్ పాల్గొన్నారు.
బోయపల్లిలో అంబలికేంద్రం ప్రారంభం
బోయపల్లిలో అంబలికేంద్రం, చలివేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రాంభించారు. హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున చలివేం ద్రాలు, అంబలికేంద్రాల ద్వారా ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. వేసవి ముగిసేవరకు ఈ కేంద్రాలను కొనసాగించాలని సూచించారు. ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు ఉద్యమిద్దాం
- నేటి నుంచి జిల్లాలో నిరసన కార్యక్రమాలు
- 7న జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష, 11న చలో ఢిల్లీ
- కార్యకర్తల సమావేశంలో మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 : రాష్ట్రంలో రైతులు పండిం చిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు పోరా టం చేద్దామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రతీ కార్యకర్త సీరియస్‌గా తీసుకోవాలని సూచిం చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని గ్రామా లు, వార్డుల్లో పార్టీ బాధ్యులు కృషి చేయాలన్నారు. ఇలాంటి సమయంలో మీ పనితీరు ఏంటో తెలుస్తుందన్నారు. ఈనెల 4న మహబూబ్‌నగర్ మండల కేంద్రంతోపాటు జడ్పీ కార్యా లయం ముందు 5వేల మంది రైతులు, పార్టీ శ్రేణులతో నిరస, 6న జాతీయ రహదారుల దిగ్బంధం భూత్పూర్ వద్ద, 7న జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి ధర్నా తెలంగాణ చౌరస్తాలో చేపట్టాలని కోరారు. 8న అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శన లు, ప్రతీ రైతుఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని, పట్టణాలలో బైక్‌ర్యాలీలు నిర్వ హించాలన్నారు. 11న కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్య క్రమానికి పార్టీ ముఖ్యులు అన్ని స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిఽధులు, పార్టీ నామినేటెడ్, అను బంధ సంఘాల నేతలు హాజరుకావాలని కోరారు. ఈ కార్య క్రమంలో మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, నాయకులు గోపాల్‌యాదవ్, తాటి గణేష్, శివరాజు, శాంతయ్య, బాలరాజు పాల్గొన్నారు.